Verse
పరిపూర్ణంబగు గురువు యెవరు? ప్రేమతో నిండిన హృదయుండె
Verse
పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు
నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే
Verse
ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు
కపటము డాగులేని సుబుద్ధి - కరుణమయ హృదయుడు
Verse
కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో
ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్
Verse
సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును
తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను