Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Mandiramu Naaku Nirmincha Mantiri Prabhuva

పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా

Parishuddha Mandiramu Naaku Nirmincha Mantiri Prabhuva

Verse
పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా
ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా
Verse
తుమ్మ కర్రతో మందసమును
జేసి బంగారును పొదిగించిన
తుమ్మకర్ర మీరేయని యంటిరి
Verse
కరుణాపీఠము కావెలెనంటిరి
కరుణాపీఠము నేనే యనుచు
ప్రాణమిడితిరి కరుణను జూపి
Verse
బలిపీఠమును చేయుమంటిరి
బలిపీఠము నా సిలువయే యనుచు
బలియైతిరి మీ రక్తము కార్చి
Verse
ఆవరణ ద్వారంబుల జేసి
ముగించితిని మీ పనినంతటిన్
మహిమయు ఘనత మీకే కల్గున్
Verse
నావన్నియును మీకిచ్చితిని
మీ వన్నియును నావే ప్రభువా
కృప జూపితిరి మీ మహాప్రేమన్
Verse
పరిశుద్ధ పట్టణమునందు
నివాస స్థలము నా కొసగితిరి
తరతరములు మీతో నివసింతున్

Related Tags

WorshipHolinessTabernacle