Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Parishuddha Parishuddha Prabhuva

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

Parishuddha Parishuddha Parishuddha Prabhuva

Lyricist: Yeshaya Veeramartin
Chorus
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా‖ పరిశుద్ధ ‖
Verse
పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా‖ పరిశుద్ధ ‖
Verse
పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ
నరులను రక్షించు కరుణా సముద్రా‖ పరిశుద్ధ ‖
Verse
పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానందప్రేమ భక్తుల కిడుమా‖ పరిశుద్ధ ‖
Verse
జనక కుమారాత్మలను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ‖ పరిశుద్ధ ‖

Related Tags

PraiseWorshipTrinity