Verse
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
Verse
పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా
Verse
పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా
Verse
పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా
Verse
జనక కుమారాత్మలను నేక దేవా
ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా