Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Pattanamu Kroththa Yerushalemu Paramu Nundi Vachuta Chuchithini

పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని

Parishuddha Pattanamu Kroththa Yerushalemu Paramu Nundi Vachuta Chuchithini

Chorus
పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము
పరము నుండి వచ్చుట చూచితిని
భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తెగా చూచితిని
Verse
సింహాసనమందు గొప్ప శబ్దముతో
బలముగ పలికిన స్వరము వింటిన్
దేవుడు నివసించు మానవులతో
తానే వారితో సదా వసించున్
Verse
దేవుడు తానే వారితో నుండి
ఆయన వారికి తండ్రియగును
ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్
మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు
Verse
మొదటి సంగతులు గతించు చుండె
పరికించుము సర్వము క్రొత్తవాయె
సింహాసన మందుండి ప్రభువే పలికె
నూతనముగా నే చేసితి ననెను
Verse
ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము
సత్యమై మారనిదై యుండు నెప్పుడు
ఆది యంతము అల్ఫా ఓమేగ
దప్పి గొన్న వానికి జలము లిచ్చున్
Verse
జయించువారు వీటన్నింటిని
వారసులై స్వతంత్రించు కొందురు
ఆయన వారికి దేవుడై యుండి
వారాయనకు పుత్రులవుదురు

Related Tags

New JerusalemRevelationHeavenly City