Verse
పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం
నన్ను రక్షించినట్టి - నా ప్రభువా
Verse
గొప్ప దేవుడవని - నే నెరిగితిని
తప్పకుండ నీ నామము - స్మరియింతును
Verse
తండ్రివైతివి నీవు - పరమునందు
దండి ప్రియుదవు నీవు - నా రక్షకా
Verse
బహు విశ్వాస హీనుడ - నగు నాకు
మహా ప్రభువై నన్నున్ - మోసెదవా!
Verse
సజీవుడవైన - విమోచకుడా
ఉజ్జీవము నొసగి - లేపితివే
Verse
మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ
కొంచెమైనను కొదువ - లేదికను
Verse
పరలోక ప్రధాన - యాజకుడా
ఏ రీతిగా నిను నే పూజింతును?
Verse
పరలోకములో నుండి - వరుడేసు
అరుదెంచు నాకై - హల్లెలూయ