Verse
పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు
సత్యాత్మా‖ పరిశుద్ధాత్మ ‖
Verse
నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు
నాత్మ‖ పరిశుద్ధాత్మ ‖
Verse
జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు‖ పరిశుద్ధాత్మ ‖
Verse
పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి
కాపాడి మెలఁగు‖ పరిశుద్ధాత్మ ‖
Verse
భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి
నీదౌను‖ పరిశుద్ధాత్మ ‖
Verse
తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము‖ పరిశుద్ధాత్మ ‖