Chorus
పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా
పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె
గద మాకు‖ పరి ‖
Verse
తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ
యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ‖ పరి ‖
Verse
విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ
శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి‖ పరి ‖
Verse
సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా
నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి‖ పరి ‖
Verse
వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు
వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు
దెలుపుమా‖ పరి ‖
Verse
సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ
కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా‖ పరి ‖