Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhaathmanu Goarumu Jeevamu Ye

పరిశుద్ధాత్మను గోరుము జీవము యే

Parishuddhaathmanu Goarumu Jeevamu Ye

Lyricist: Bethala John
Verse
పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము
నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె
వేదమునందు‖ పరిశుద్ధాత్మను ‖
Verse
పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక
టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును
వేగఁ‖ పరిశుద్ధాత్మను ‖
Verse
పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక
ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై
యుండుఁ‖ పరిశుద్ధాత్మను ‖
Verse
పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర
రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని
కరుణాధికము వడయఁ‖ పరిశుద్ధాత్మను ‖
Verse
పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ
లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున
మమ్ము‖ పరిశుద్ధాత్మను ‖
Verse
పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర
నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత
మగు దనుక‖ పరిశుద్ధాత్మను ‖

Related Tags

DevotionalPrayerHoly Spirit