Chorus
పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ
చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా
టిరి నీదు సత్యంబు‖ పరి ‖
Verse
బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్
నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు
చుందురు‖ పరి ‖
Verse
ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ
పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ
గుము‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను
ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ
బంపుము దేవ‖ పరి ‖
Verse
నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా
యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ
దయచేసి నీ యొద్దఁ‖ పరి ‖
Verse
జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను
సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ
మొందు నీ వాక్కు‖ పరి ‖
Verse
ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము
అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన
సంఘాధ్యక్షుండ‖ పరి ‖
Verse
నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు
జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా‖ పరి ‖