Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhaathmuda Prabhuva Varada

పరిశుద్ధాత్ముఁడ ప్రభువ వరదా

Parishuddhaathmuda Prabhuva Varada

Lyricist: Dasari Moses
Chorus
పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా హృదయమం దిరముల వసి
యింపుమా అరుదైన నీదివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా
కరుణాబ్ధివై యిపుడు‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయాం తర దురితతూలం
బును దరికొల్పి పరిశుద్ధ పఱచి మా యాత్మల మా వరరక్షకునకు న
ర్పణ ముగా నిడుమయ్య‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
కాంతులీనెడు దీప కలికవైవచ్చి మా స్వాంతంబులఁగప్పిన యంతు
లేని యవిద్యా ధ్వాంతంబుఁ జోపి సు స్వాంతులేగెడు సత్య సరణిఁ
జూపింపుమా‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
చలువఁ గూర్చెడు మంచు జల్లురూపమున మ మ్ముల నెల్ల దీవింపుమా
ఫలశూన్యంబైన యా ఆత్మలకు నీ బల మొసఁగి ఫలవంతములుగ
గే వలుఁడా యొనరింపుమా‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
పరమ పారావతమా! పక్షములు విప్పి మా శిరములపైని చాఁచి
పరమందు నీ సంఘ పరిశుద్ధులకువలెనె ధరనున్న మాకు నీ వరముల
నిడుమయ్య‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
దివినుండి భువికి నా రవముతో వీతెంచు పవమానాకారుండవై నవ
జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము
కృపచేఁ‖ పరిశుద్ధాత్ముఁడ ‖
Verse
అందమౌ నీమోము నందుఁ జిందెడు తేజ మందఱు వీక్షింపగా విందవై
వచ్చి మా డెందంబులకు నిత్యా నందంబుఁగూర్చి మా వందనంబులు
గొనుమా‖ పరిశుద్ధాత్ముండ ‖

Related Tags

PrayerHoly Spirit