Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhaathmunia bomdhumu prabhu

పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభు

Parishuddhaathmunia bomdhumu prabhu

Lyricist: Mandapaka Kesavarayasarma
Chorus
పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం దుము
పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు పరి పూర్తిగా
దొరకు‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ
రక్షకుఁడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడఁ పరగఁగైకొను
మిపుడే‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగుఁన్ పర
మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగాఁ
దెలియును‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ పరమ పాటవ మబ్బును
సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ దెలియును వరములను బొందుటకు
తెరువులభియించును‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ పరమ విజయము గల్గును
దురితంపు శోధనలఁ దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో
జయమిచ్చు‖ పరి ‖
Verse
పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ
జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపఁగలమట్లు‖ పరి ‖

Related Tags

PrayerGuidanceHoly Spirit