Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddham Parishuddham Parishuddham

పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం

Parishuddham Parishuddham Parishuddham

Lyricist: Thuloori Cornelius
Chorus
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా పరమ కానానున
కరుగున దెపుడో‖ పరిశుద్ధం ‖
Verse
పరిశుద్ధమయిన యా యెరుషలేము పురము వర పద్మరాగంపు స్ధిర
పునాదులతోడ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నురురత్న ద్వారంబు
లదిరిగ గల వహహ‖ పరిశుద్ధం ‖
Verse
ఆ నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశి కానఁ బడఁ
బోవు దేదీప్య మానంబై విలసిల్లు మానిత గొఱ్ఱియ దానికి జ్యోతియై
తనరుచుండు నహహ‖ పరిశుద్ధం ‖
Verse
శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాఁటు శ్రేష్ట
సమయంబున మంగళ ప్రదమైన మహిమ రాజ్యమునందు రంగైన
ప్రభుయేసు రాజున్ దర్శింతును‖ పరిశుద్ధం ‖
Verse
తళతళ మెఱసెడు ధవళంపు టంగీలు కళ లీనుచుండంగ గాళ్లార
ధరియించి భళిర భళిర యంచు భక్తాళితో నెపుడు నెళవుగా నుందుము
నిజ రక్షకుని చెంత‖ పరిశుద్ధం ‖
Verse
భూరి వీణెలు చేతఁ బొల్పుగ ధరియించి సారెకు మీటుచు సంగీత
ములు బాడి శ్రీ రాజా నీకు జో హారంచు ప్రభు యేసు పేరఁ గీర్తింతురు
ప్రియ భక్తులందఱు‖ పరిశుద్ధం ‖
Verse
కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీటమును జుట్టి
తిరుగు దూతలఁగూడి పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ
సంగీతంబు బాడుచుండెద నాహా‖ పరిశుద్ధం ‖

Related Tags

WorshipHolinessHeaven