Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhi Parishuddhi Parishuddhi

పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి

Parishuddhi Parishuddhi Parishuddhi

Lyricist: Purushothamu Choudari
Chorus
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద
పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై
భాసురమై సు స్థిరమై సుందరమైన‖ పరిశుద్ధి ‖
Verse
రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ
సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం
స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ‖ పరిశుద్ధి ‖
Verse
గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న
ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు‖ పరిశుద్ధి ‖
Verse
ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి
సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ
రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు‖ పరిశుద్ధి ‖
Verse
జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా
పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ
ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి‖ పరిశుద్ధి ‖
Verse
వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర
మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు
ని చ్ఛల నిచ్చు దేవుఁడు‖ పరిశుద్ధి ‖

Related Tags

WorshipHolinessHeaven