Chorus
పరిశుధ్ధుడా నా యేసయ్యా
నీదు ఆత్మతొ మము నింపుమా
అభిషిక్తుడా నా యేసయ్యా‖ 2x ‖
నీ అభిషేకముతో మము నడుపుమా
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా‖ 2x ‖
Verse
తిష్భీయుడైన ఏలియాను నీవు
ఆత్మతొ నింపి నడిపించావు‖ 2x ‖
కర్మెలు పర్వతమెదుట జనులందరిముందు
ఏలియాను నీవు ఘనపరిచావు‖ 2x ‖
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా‖ 2x పరిశుధ్ధుడా ‖
Verse
దైవజనుడైన ఎలీషాను నీవు
రెండంతల ఆత్మతొ నడిపించావు‖ 2x ‖
యెరికో నీళ్ళను మంచిగ మార్చి
మరణము రాకుండ తప్పించావు‖ 2x ‖
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా‖ 2x పరిశుధ్ధుడా ‖
Verse
శిశ్యుడైన పేతురును నీవు
ఆత్మతొ నింపి నడిపించావు‖ 2x ‖
బోధించే వరమును ఇచ్చి సాక్షిగ నిలిపీ
వేలమందిని మార్చావయ్య‖ 2x పరిశుధ్ధుడా ‖