Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhulai Yundudi Daiva Chittamuna Perugudi

పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి

Parishuddhulai Yundudi Daiva Chittamuna Perugudi

Verse
సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి 1 పేతురు Peter 1:16
Chorus
పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి
యథార్దులై యుండుడి
Verse
నడతలలో - వస్త్రములలో
ఆటంకము లేమియు లేకుండ
అడుగు ప్రశ్న జవాబులలో
విడువకజూపుము - పరిశుద్ధత
Verse
పనులలోన ప్రతిస్థలమున
పరిశుద్ధ జీవిత మవసరము
ప్రతిదారిన్ - ప్రతి సమయమున
పనులలో చూపుము - పరిశుద్ధత
Verse
ప్రేమ ఐక్యత పెరుగజేయున్
శ్రమ దుఃఖముల దూరపరచున్
ప్రియముతో నెల్లరు చేరిపోరు
మాని కోరుము - పరిశుద్ధత
Verse
దేవునిపోలిన జీవముఁజూప
కావలయును పావన జీవం
జీవిత వేషంబు వ్యర్థము
కీడునుబాపును - పరిశుద్ధత
Verse
శుద్ధసాక్ష్యము - భద్రపరచును
ఇద్దరిణిలో సిద్ధపరచున్
శుద్ధమగు - చిత్తంబు కలుగు
శాశ్వతశుద్ధి - పరిశుద్ధత
Verse
నీతితోడ - జ్యోతియుండిన
లేదు కొఱత లేదు చూడన్
మేదినిపై నిలుచు శేషము
వాదమేమి నికలేదు - పరిశుద్ధత
Verse
ఇలను దేహమాత్మలందు
కల్మషంబు కానరాదు
తెలుపగు తేటైన మచ్చలు
సిలువరక్తమున – పరిశుద్ధత

Related Tags

HolinessChristian Life