Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhulellaru Yesun Pogadi Paadi Yaarbhatinchi Paramunanunda

పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి పరముననుండ

Parishuddhulellaru Yesun Pogadi Paadi Yaarbhatinchi Paramunanunda

Verse
పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ
పరమానంద గీతమచ్చట ధ్వనింప - నీ వచట నుందువా? (3) నా మానసమా!‖ 3x ‖
Verse
గొర్రెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర
మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
Verse
పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపొ స్తలులందరు
హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా? నా మానసమా!
Verse
జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు
దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!
Verse
శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు
జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
Verse
కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి
భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!
నేనచట నుండెదను నా యేసుతోడ

Related Tags

WorshipSecond ComingHeaven