Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishudhdhaathmuda Deva Prabhuvana

పరిశుద్ధాత్ముఁడ దేవ ప్రభువా న

Parishudhdhaathmuda Deva Prabhuvana

Lyricist: Kadiyam Gabriel
Chorus
పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య
వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు
మయ్య‖ పరి ‖
Verse
బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ
గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన
తుల్ సల్పుదు మయ్య‖ పరి ‖
Verse
బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము
కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ
బల వాక్య మిడు మాకుఁ‖ పరి ‖
Verse
విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము
కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని
యవనిం బ్రతుక నిమ్ము‖ పరి ‖
Verse
పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్
త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ
భయమొంద నీయకుము‖ పరి ‖
Verse
మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే
తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము
మము ప్రభువా‖ పరి ‖

Related Tags

WorshipPrayerHoly Spirit