Verse
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు‖ 2x ‖
Verse
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ‖ 2x ‖
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా‖ పరిశుద్ధుడు ‖
Verse
నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును‖ 2x ‖
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా‖ పరిశుద్ధుడు ‖