Verse
పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా‖ 2x పరుగెత్తెదా ‖
Verse
దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి‖ 2x ‖
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా‖ 2x పరుగెత్తెదా ‖
Verse
ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో‖ 2x ‖
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా‖ 2x పరుగెత్తెదా ‖
Verse
యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు‖ 2x ‖
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా‖ 2x పరుగెత్తెదా ‖