Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parugetthi ninu cheri

పరుగెత్తి నిను చేరి

Parugetthi ninu cheri

Lyricist: Guru Krishna Kadoni, Vishal Dass , Annoz Kamalakar
Verse
పరుగెత్తి నిను చేరి
నీ సన్నిధిలో మోకరించెదా
యేసు నీతో నే నడచి
నీ అడుగులన్ని లెక్కించెదా
నా హృదయం నా మనసు
నా సమస్తము నీకేనయ్యా
Chorus
అత్మతోను సత్యముతో
నిన్నే నే సేవించెదా
ఆరాధన నీకే ఆరాధన
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్
Verse
పేతురువలె నీటి మీద నడచి వచ్చెదా
పౌలువలె నీ గురి యొద్దకే నే పరుగెత్తెదా
అలలే వచ్చి నన్ను బెదిరించినా
విశ్వాసముతో నే ముందుకెళ్ళెదా
సంద్రమే లేచి నన్ను ముంచివేసినా
నీ చేయి పట్టుకొనెదా
Verse
దావీదువలె నాట్యముతో నిన్నే ఆరాధించెదా
దానియేలువలె మూడు మార్లు నీకే ప్రార్ధించెదా
శ్రమలే వచ్చి నన్ను కదిలించినా
నీ సహాయముతో నే జయించెదా
నిందలెన్నో నన్ను కృంగదీసినా
నీ మార్గములో నడిచెదా
Verse
నా మార్గము నీవే నా గమ్యము నీవే
నా వెలుగు నీవే ఆధారము నీవే
నా సైన్యము నీవే నా ఖడ్గము నీవే
నా ధైర్యము నీవే నా విజయము నీవే

Related Tags

WorshipFaithDevotion