Chorus
పరుగిడిరా సోదరుడా - ప్రభు సన్నిధి నీవు జేరుటకై
Verse
యుగసమాప్తికి ఆగమనముకు
సూచన లెన్నో చూడుమురా
వేదన లెన్నో మీదికి వచ్చురా
కలవర మొందక కని పెట్టుమురా
Verse
ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు
నారును నాటుచు త్రాగుచు తినుచు
జగములో జనులు దిగులు లేనప్పుడు
దొంగవలె యిల దొరయై వచ్చురా
Verse
ఆ దినమైనను ఆ గడియైనను
పరమున దూతలు ధరణిలో మనుజులు
ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు
మెలకువతో యేసు పిలుపును వినుచు
Verse
ఆ దినముల శ్రమ అంతము గాక
సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహిదిగురా
Verse
ఆర్భాటముతో ఆశ్చర్యముతో
దేవుని బూరతో మనప్రభు దిగురా
క్రీస్తు నందున్న మృతులగువారు
ఏకముగ ప్రభు యేసుని జేర
Verse
ఎటుచూచిన నీకటు కనిపించును
కొండల బండల నుండినను
కొదమ సింహమై కోపాగ్నియై
ఎదురుగ వచ్చిన కదలగ్ లేవురా
Verse
ఎత్తబడుట కాయత్తమా నీవు
తరుణము యిదియే తడవు చేయకురా
రక్షణలో నిరీక్షణ కలిగి
రక్షకు డేసుని రాజ్యము చేర