Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parvathama Neevepaati Zerubbabelu Edutanu Samabhoomi Vaguduvu

పర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు

Parvathama Neevepaati Zerubbabelu Edutanu Samabhoomi Vaguduvu

Chorus
పర్వతమా నీవేపాటి
జెరుబ్బాబెలు ఎదుటను
సమభూమి వగుదువు
Verse
జనులందరూ కృప కలుగుననగా
తానుంచున్ - పై - రాతిన్
Verse
శక్తితో కాదిది బలముతో కాదు
నాదు ఆత్మచే జరుగును యిదియనే
సైన్యములధిపతి యెహోవా వాక్కిది
మారదెన్నటికిన్
Verse
కాన ఆలయమును నిర్మింపను
పూనుకొందము రమ్మని పలుక
మేలైన ఈ కార్యమును చేయను
బలమును పొందితిమి
Verse
ఆకాశమందున నివాసియగు ప్రభు
మా యత్నములను సఫలము చేయునని
ఆయన దాసులమగు మేమెల్లరము
మొదలిడి ముగించితిమి
Verse
మందిరమును నాదు మహిమతో నింపుదున్
మించును అదియెంతో మునుపటి దానిన్
మెండుగ నాదు నిండు నెమ్మది
నుండ నను గ్రహింతున్
Verse
సజీవ రాళ్ళుగ ఆత్మ మందిరమున
నిపుణతతో మము నిర్మించుటకు
పిలిచితివి నీదు యాజకులుగను
హల్లెలూయ పాడెదము

Related Tags

WorshipFaithStrength