Verse
పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను
మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు
నీ నిబంధన తొలగిపోదు
Verse
సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే‖ 2x ‖
భూషణ కిరీటము సొగసైన మకుటము‖ 2x ‖
చిగురు మహిమ శుభలక్షణమగును
Verse
మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు
విమోచకుడు పరిశుద్ధ దేవుడు
భయము వలదని సహాయము చేయును
Verse
మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని
మంటిలో పడియున్న ప్రేతలైన వారు
మేల్కొని మహిమలో ఆనందింతురు
Verse
యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే
నా నిమిత్తము దావీదు నిమిత్తము
ఈ పట్టణమును కాపాడి రక్షింతు
Verse
నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును
నా కను దృష్టి యెహోవావైపుకే
తిరిగి యున్నది హల్లెలూయా