Chorus
పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని సన్నిధి కేగుము
పశ్చాత్తాపములేని ప్రజలెవ్వరికి గాని నిశ్చయముగ గల్గు నిత్యమౌ
నరకంబు‖ పశ్చాత్తా ‖
Verse
ఎంత పాపవైనను జీవము క్రీస్తు చెంత పార్థనఁ జేయుము
సంతోషమును మన శ్శాంతిని నొసఁగున నంతుఁడైన విమ లాత్ముఁ
డాదరించు‖ పశ్చాత్తా ‖
Verse
జారచోరకార్యము లేవైనను బారఁదోలును వేగము నారాజ్యమును వెదకు
నరు లందఱకు జీవ ధార లెచ్చెదనని కోరి కర్త వచించె‖ పశ్చాత్తా ‖
Verse
వినుము ప్రభువు వాక్యము జీవము నీవు గనుము రక్షణ భాగ్యము
తనువు నిత్యముగాదు నిను నీవె నమ్మకు వినయ బుద్ధిని గ్రీస్తు ఘనము
వెదుకుము వేగ‖ పశ్చాత్తా ‖
Verse
దిక్కుమాలిన దానవే జీవము ప్రభుని మ్రొక్కి పరమును జేరవే నిక్కమిది
నీ పాప మెక్కువగా నున్న మక్కువతో నిన్ను గ్రక్కున విడిపించు‖ పశ్చాత్తా ‖
Verse
బలములేని దానవే జీవమ యాత్మ బలము బొందుము వేగమే యిలను
విద్యాధన బలముల నమ్మక కలుష జాలము వీడి కర కడకేగుము‖ పశ్చాత్తా ‖
Verse
మందపోషకుఁడు క్రీస్తు జీవమ యేసా నందపూర్ణుఁడు థీరుఁడు
వందిత సత్సంఘ మందుఁ జేరిన సత్యా నందంబు నిత్యంబు నొందుచు
నుందువు‖ పశ్చాత్తా ‖