Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Peda Naruni Roopamu

పేద నరుని రూపము

Peda Naruni Roopamu

Lyricist: Songs Of Zion
Verse
పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను‖ 2x పేద నరుని ‖
Verse
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్‖ 2x ‖
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె‖ 2x పేద నరుని ‖
Verse
తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు‖ 2x ‖
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను‖ 2x పేద నరుని ‖
Verse
ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్‖ 2x ‖
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే‖ 2x పేద నరుని ‖
Verse
మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల‖ 2x ‖
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో‖ 2x పేద నరుని ‖
Verse
తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము‖ 2x ‖
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె‖ 2x పేద నరుని ‖

Related Tags

WorshipGospelRepentance