Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Peda Naruni Roopamu Dharinchi

పేద నరుని రూపము ధరించి

Peda Naruni Roopamu Dharinchi

Chorus
పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను‖ 2x పేద నరుని ‖
Verse
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే
నింద వేదన శ్రమలను సహించెనేసు‖ 2x ‖
చిందే తనదు రక్తము నీ పాపముకై‖ 2x ‖
దీనుడై నిన్ను పిలచుచుండె‖ 2x పేద నరుని ‖
Verse
తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు‖ 2x ‖
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను‖ 2x పేద నరుని ‖
Verse
మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల‖ 2x ‖
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో‖ 2x పేద నరుని ‖

Related Tags

SalvationSacrificeJesusLove