Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Peda Naruni Roopamu Dharinchi Yesuraju Nee Chentha Nilache Angikarinchu Maayananu

పేద నరుని రూపము దరించి యేసురాజు నీ చెంత నిలచే అంగీకరించు మాయనను

Peda Naruni Roopamu Dharinchi Yesuraju Nee Chentha Nilache Angikarinchu Maayananu

Verse
పేద నరుని రూపము దరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
Verse
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె
ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె
నింద వేదన శ్రమలను సహించె
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలుచుచుండె
Verse
తలవాల్చుటకు ఇల స్థలమేలేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
పాట్లుపడె నిన్ను విడిపింపను
Verse
ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాపడాగులన్ రక్తముతో కడిగెన్
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందె
Verse
మాయలోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవు నిల
నిత్యదేవుని ప్రేమను నమ్మినీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో
Verse
తామసించెద వేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె

Related Tags

SalvationSacrificeJesusLove