Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Peda Naruni Rupamu

పేదనరుని రూపము

Peda Naruni Rupamu

Verse
పేదనరుని రూపము ధరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
Verse
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండే
Verse
తలవాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరక లేదు
తన్ను ఆధరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను
Verse
మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిలా
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విస్వాసముతో

Related Tags

SalvationSacrificeJesus