Verse
అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం‖ 2x ‖
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు‖ 2x అందమయిన ‖
Verse
ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు‖ 2x ‖
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం‖ 2x అందమయిన ‖
Verse
శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను‖ 2x ‖
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే, నా అందము‖ 2x అందమయిన ‖
Verse
అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను‖ 2x ‖
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం‖ 2x అందమయిన ‖