Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Peruke Kraisthavulara

పేరుకే క్రైస్తవులారా

Peruke Kraisthavulara

Chorus
పేరుకే క్రైస్తవులారా
నులివెచ్చని క్రైస్తవులారా‖ 2x ‖
మాదిరి లేని క్రైస్తవులారా
ఆదివారపు క్రైస్తవులారా‖ 2x ‖
ఈ పాటలోని మాటలతో మేలుకో
నిజ క్రైస్తవమేదో తెలుసుకో‖ 2x పేరుకే ‖
Verse
క్రీస్తునామధారులమని సాక్ష్యమిత్తురు
సాతాను క్రియలలో పాల్గొందురు
క్రీస్తునామధారులమని చెప్పుకుందురు‖ 2x ‖
సాతాను క్రియలలో పాల్గొందురు
పాపములను ఒప్పుకుందురు
కాని విడిచిపెట్టక కప్పుకుందురు‖ 2x ‖
మారుమనసు అనుభవమే
యెరుగకుందురు‖ 2x పేరుకే ‖
Verse
క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి
క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచీ‖ 2x ‖
పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు‖ 2x ‖
ప్రభో ప్రభని పదేపదే ప్రార్థింతురు‖ 2x పేరుకే ‖
Verse
కడు రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు
బహు దివ్యముగా బోధలెన్నొ చేయగలరూ
కడు రమ్యముగా పాటలెన్నొ వ్రాయచుందురు‖ 2x ‖
బహు దివ్యముగా బోధలెన్నొ వినుచుందురు
కాని వారి హృదయము ప్రభుకు దూరము
మరి సాతానుకు నిత్య నిలయము‖ 2x ‖
పై పెదవులతో ఘనపరతురు
ప్రభువునామము‖ 2x పేరుకే ‖
Verse
సత్యమందు ప్రతిష్టింపబడిన వారలు నిత్య
రాజ్యమందు చేరువారు యోగ్యులు‖ 2x ‖
పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు
పరిశుద్ధులుగా ఇల జీవించువారలు‖ 2x ‖
నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు‖ 2x పేరుకే క్రైస్తవులారా ‖

Related Tags

FaithRepentanceChristian Life