Verse
ఫలములనాశించిన పరలోక తండ్రి
తేరి చూచుచున్నాడు నీ వైపు‖ 2x ‖
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు‖ 2x ‖
ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా‖ 2x ‖
Verse
ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు‖ 2x ‖
చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు‖ 2x ‖
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు‖ ఫలియించకుండుట ‖
Verse
వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా‖ 2x ‖
ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే‖ 2x ‖
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా‖ ఫలియించకుండుట ‖