Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pilichenu Prabhu Yesu Naathudu

పిలిచెను ప్రభు యేసు నాథుడు

Pilichenu Prabhu Yesu Naathudu

Lyricist: A J Emmanuel
Verse
పిలిచెను ప్రభు యేసు నాథుడు
ప్రేమతో నిను తెలుసుకో
అలక దృష్టితో పలుచ సేయక
దీనమనస్సుతో చేరుకో..
Verse
కంటికి కనబడునదెల్ల
మంటికి మరి మరలిపోవు
నేలనొలికిన నీటి వలెనే
మరల రాదని తెలుసుకో
Verse
నరుడుయగు ప్రతివాడు పాపియె
మరణమే పాపపు ఫలితము
నరులకు నిత్య జీవమొసగెడు
యేసు ప్రభువును చేరుకో

Related Tags

InvitationGospelSalvation