Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pillalaara

పిల్లలారా

Pillalaara

Lyricist: Songs Of Zion
Verse
పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను‖ 2x పిల్లలారా ‖
Verse
బ్రతుక గోరువాడెవడైన కలడా?‖ 2x ‖
మేలునొందుచు చాలా దినములు‖ 2x పిల్లలారా ‖
Verse
కపటమైన చెడు మాటలాడక‖ 2x ‖
కాచుకొనుము నీదు పెదవులను‖ 2x పిల్లలారా ‖
Verse
కీడు మాని మేలునే చేయుము‖ 2x ‖
సమాధానము వెదకి వెంటాడు‖ 2x పిల్లలారా ‖
Verse
యెహోవా దృష్టి నీతిమంతులపై‖ 2x ‖
కలదు వారి మొఱల వినును‖ 2x పిల్లలారా ‖
Verse
దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి‖ 2x ‖
కొట్టివేయు తన సన్నిధి నుండి‖ 2x పిల్లలారా ‖
Verse
నీతిమంతులు మొఱ పెట్టగా‖ 2x ‖
విని శ్రమల నుండి తప్పించును‖ 2x పిల్లలారా ‖
Verse
విరిగినట్టి హృదయములకు‖ 2x ‖
యెహోవా ఆసన్నుడై యున్నాడు‖ 2x పిల్లలారా ‖
Verse
నలిగియున్న వారల నెల్ల‖ 2x ‖
ఆయనే రక్షించు ప్రేమగల్గి‖ 2x పిల్లలారా ‖

Related Tags

WisdomChildren