Verse
పిండమునై నేను నా తల్లి గర్భమున
ఉండగానే నన్ను పిలిచిన నా దేవా
పాపములో నుండి నన్ను రక్షించి
తండ్రివై నన్ను నడిపిన నా నాధా
Verse
కంటిపాపలా కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా
Verse
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
Verse
నడకను నాకు నేర్పిన
నా పరమ తండ్రివి నీవే దేవా
జీవితమే బహుమానముగా
నాకు ఇచ్చిన నా జీవ దాత
కునుకడు నిదురించడు
మరువడు విడనాడడు
చేయిపట్టి నడుపును
శిఖరముపైన నిలుపును