Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pondithini Nenu Prabhuvaa Nee Nundi

పొందితిని నేను ప్రభువా నీ నుండి

Pondithini Nenu Prabhuvaa Nee Nundi

Verse
పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు‖ 2x ‖
Verse
జీవిత యాత్రలో సాగి వచ్చితిని‖ 2x ‖
ఇంత వరకు నాకు తోడై యుండి‖ 2x ‖
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా‖ 2x ‖
నా రక్షణ కర్తవు నీవైతివి‖ 2x పొందితిని ‖
Verse
గాలి తుఫానులలోనుండి వచ్చితిని‖ 2x ‖
అంధకార శక్తుల ప్రభావమునుండి‖ 2x ‖
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా‖ 2x ‖
నీవే ఆశ్రయ దుర్గంబైతివి‖ 2x పొందితిని ‖
Verse
కష్ట దుఖంబులు నాకు కలుగగా‖ 2x ‖
నను చేరదీసి ఓదార్చితివే‖ 2x ‖
భయ భీతి నిరాశల యందున ప్రభువా‖ 2x ‖
బహుగా ధైర్యంబు నాకొసగితివి‖ 2x పొందితిని ‖
Verse
నా దేహమందున ముళ్ళు నుంచితివి‖ 2x ‖
సాతానుని దూతగా నలుగ గొట్టన్‖ 2x ‖
వ్యాధి బాధలు బలహీనతలందు‖ 2x ‖
నీ కృపను నాకు దయచేసితివి‖ 2x పొందితిని ‖
Verse
నీ ప్రేమ చేత ధన్యుడనైతిని‖ 2x ‖
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను‖ 2x ‖
కష్ట పరీక్షలయందు నా ప్రభువా‖ 2x ‖
జయజీవితము నాకు నేర్పించితివి‖ 2x పొందితిని ‖

Related Tags

PraiseThanksgivingGrace