Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pondithini Nenu Prabhuvaa Nee Nundi Prathi Shreshtayeevini Ee Bhuviyandu

పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు

Pondithini Nenu Prabhuvaa Nee Nundi Prathi Shreshtayeevini Ee Bhuviyandu

Verse
పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు
Verse
జీవిత యాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి
Verse
గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి
Verse
కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా దైర్యంబు నా కొసగితివి
Verse
నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి
Verse
నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి

Related Tags

ThanksgivingGraceTestimony