Chorus
పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై‖ 2x పూజనీయుడేసు ‖
Verse
నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా‖ 2x ‖
ఎన్నో బాధ లొందితివా నాకై‖ 2x ‖
సన్నుతింతును నీ ప్రేమకై‖ పూజనీయుడేసు ‖
Verse
సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి‖ 2x ‖
వంచకుడవని నిన్ను నిందించిరా‖ 2x ‖
ఓ దయామయా నజరేయుడా‖ పూజనీయుడేసు ‖
Verse
యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా‖ 2x ‖
అధములు నిను సమరయుడనిరా‖ 2x ‖
నాథుడా నిను బహు దూషించిరా‖ పూజనీయుడేసు ‖
Verse
మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును‖ 2x ‖
వధియించబడితివా యీ పాపికై‖ 2x ‖
వందితా ప్రభు నిన్ను పూజింతును‖ పూజనీయుడేసు ‖