Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Poojaneeyudesuprabhu Palunindala Nondithiva Naakai

పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై

Poojaneeyudesuprabhu Palunindala Nondithiva Naakai

Verse
పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై
పూజనీయుడేసు ప్రభు
Verse
నీ స్వకీయులే నిందించిన
నీన్నంగీకరించక పోయిన
ఎన్నో బాధ లొందితివా నాకై
సన్నుతింతును నీ ప్రేమకై
Verse
సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి
వంచకుడవ నిన్ను నిందించిర
ఓ దయామయ నజరేయుడ
Verse
యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా
అధములు నిన్ను సమరయు డనిర
నాథుడా నిన్ను బహు దూషించిరా
Verse
దూషించు శత్రుసమూహములన్
దీవించి ఎంతో క్షమించితివి
దూషకుడవని నిన్ను దూషించిర
దోషరహితుడా నా యేసు ప్రభు
Verse
దయ్యములు నినుజూచి వణికినను
దయ్యముల పారద్రోలినను
దయ్యములు పట్టిన వాడనిర
ఓ దయామయ నా యేసు ప్రభు
Verse
మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నా రాధింతును
వధియించబడితివ యీ పాపికై
వందితా ప్రభు నిన్ను పూజింతును

Related Tags

WorshipJesusSuffering