Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Poorna Hrudhayamutho Poorna Aathmatho

పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో

Poorna Hrudhayamutho Poorna Aathmatho

Lyricist: Joel Kodali
Verse
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును
మంచి దేవుడవు ఎంతో మంచి ప్రభుడవు
నా మంచి ప్రియుడవు యేసు నిను ప్రేమింతును
Verse
నేనంటు లేనపుడే యేసు
నను నీవు యెరిగితివని తెలుసు
నిను నేను కోరక మునుపే
నను కోరి భువిపై జన్మించి
నా పాపము దూరము చేయుటకు
నా బలము చాలదు ఆని యెరిగి
నీ మదిలో నా పేరు తలచి
ఆనాడే నాకై మరణించి
రక్షణనిచ్చితివి – ఉచితముగా కృపమూలముగా
నీ మేలును ఏల మరతును యేసు నిన్ను ప్రేమింతును
Verse
నాపై నీకంత ప్రేమ
ఎందుకనో తెలిపెదవా దేవా
ఒక రోత హృదయుని కోసం
అన్ని ఘోర శ్రమలను పొందితివా
లోకము ఎరుగని వింత ప్రేమ
సిలువలో నిను చూడగా కనిపించే
నీ దేహముపైన గాయములు
ఆ ప్రేమ లోతును కనపరిచే
నా పాపమంతటిని – కడిగితివా నీ రక్తముతో
నన్నంతగా ప్రేమించితివి – నేను నిన్ను ప్రేమింతును

Related Tags

PraiseWorship