Chorus
పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము
పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి
Verse
సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ
క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద
భక్తి మా కెబ్బఁ‖ పోపోవే ‖
Verse
నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి
దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై
ననుఁబిల్చెఁ‖ పోపోవే ‖
Verse
ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి
జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి
యేమున్నది చాలుఁ‖ పోపోవే ‖
Verse
ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ
గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు
డిపు డిచ్చుఁ‖ పోపోవే ‖