Verse
పోరాటం ఆత్మీయ పోరాటం‖ 2x ‖
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి‖ 2x ‖
Verse
నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన‖ 2x ‖
నా యేసు కొరకే సమర్పించుకున్నాను‖ 2x ‖
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను‖ పోరాటం ‖
Verse
నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా‖ 2x ‖
నా యేసు కృపనుండి దూరపరచలేవని‖ 2x ‖
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను‖ పోరాటం ‖
Verse
ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు‖ 2x ‖
ఆ సింహాసనం నా గమ్యస్థానం‖ 2x ‖
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను‖ పోరాటం ‖