Chorus
పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ
సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ
దరిగి‖ పోయెఁగ ‖
Verse
ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి
మడసినారు‖ పోయెఁగ ‖
Verse
జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు
గొయ్యి వెదకు‖ పోయెఁగ ‖
Verse
ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి
పాలౌను‖ పోయెఁగ ‖
Verse
మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు
కొన్నావు‖ పోయెఁగ ‖
Verse
చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు
గానంగలేవ‖ పోయెఁగ ‖
Verse
జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు‖ పోయెఁగ ‖