Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praanamaa Naa Praanamaa

ప్రాణమా నా ప్రాణమా

Praanamaa Naa Praanamaa

Lyricist: Diyya Prasada Rao
Verse
ప్రాణమా నా ప్రాణమా
ప్రియ యెహోవాను సన్నుతించుమా
ప్రియ యెహోవా చేసిన మేలులను
నీవు ఎన్నడు మరువకుమా‖ ప్రాణమా ‖
Verse
గత కాలములన్నిటిలో
కృపతోనే నడిపించెను‖ 2x ‖
కరుణ కటాక్షమనే‖ 2x ‖
కిరీటం నీకు దయచేసెను‖ 2x ప్రాణమా ‖
Verse
నిను విడువక ఎడబాయక
నిత్యం నీకు తోడైయుండెను‖ 2x ‖
నీవు నడిచిన మార్గములో‖ 2x ‖
నీకు దీపమై నిలచెనుగా‖ 2x ప్రాణమా ‖
Verse
పాప శాపము వ్యాధులను
పారద్రోలియే దీవించెను‖ 2x ‖
పరిశుద్ధుడు పరమ తండ్రి‖ 2x ‖
బలపరిచెను తన కృపతో‖ 2x ప్రాణమా ‖
Verse
మహా ఆనంద మానందమే
మహారాజా నీ సన్నిధిలో‖ 2x ‖
మహిమగల మహారాజా‖ 2x ‖
మనసారా స్తుతించెదను‖ 2x ప్రాణమా ‖

Related Tags

PraiseThanksgiving