Chorus
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర‖ ప్రాణేశ్వర ‖
Verse
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె‖ 2x ‖
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే‖ 2x ప్రాణేశ్వర ‖
Verse
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద‖ 2x ‖
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి‖ 2x ప్రాణేశ్వర ‖
Verse
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన‖ 2x ‖
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు‖ 2x ‖
Verse
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను‖ 2x ‖
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము‖ 2x ‖
Verse
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన‖ 2x ‖
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి‖ 2x ప్రాణేశ్వర ‖