Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praardhana Yesuni Sandarshana

ప్రార్ధన యేసుని సందర్శన

Praardhana Yesuni Sandarshana

Verse
ప్రార్ధన యేసుని సందర్శన
పరమ తండ్రితో సంభాషణ
Verse
కరములెత్తి ప్రార్ధించగా
పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా
మధుర స్వరముతో మాటాడును‖ ప్రార్ధన ‖
Verse
తండ్రి అని నే పిలువగా
తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా
కన్నీరంతయు తుడిచివేయున్‖ ప్రార్ధన ‖
Verse
మోకరించి ప్రార్ధించగా
సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును
మహిమతో నలంకారించును‖ ప్రార్ధన ‖
Verse
కుటుంబముతో ప్రార్ధించగా
కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును
శాశ్వత జీవము అచటుండును‖ ప్రార్ధన ‖
Verse
సంఘముగను ప్రార్ధించగా
కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును
ఆత్మ వరములతో నింపును‖ ప్రార్ధన ‖
Verse
ఉపవాసముతో ప్రార్ధించగా
కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును
క్రొత్త పానము త్రాగించును‖ ప్రార్ధన ‖
Verse
ఏకాంతముగా ప్రార్ధించగా
నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును
యేసు రాజ్యము నను చేర్చును‖ ప్రార్ధన ‖

Related Tags

WorshipDevotionalPrayer