Chorus
ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము‖ ప్రార్ధన ‖
Verse
ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం
క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము‖ 2x ‖
ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం
దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం‖ ప్రార్ధన ‖
Verse
ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం
దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం‖ ప్రార్ధన ‖
Verse
ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం
ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం‖ ప్రార్ధన ‖
Verse
ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం
ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం‖ ప్రార్ధన ‖