Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praardhinchumu

ప్రార్థించుము

Praardhinchumu

Lyricist: Songs Of Zion
Verse
ప్రార్థించుము నీ జీవితములో
నెమ్మది సుఖము లొందెదవు‖ 2x ‖
సంపూర్ణ భక్తిని కలిగించును
క్షేమములెన్నో పొందెదవు‖ 2x ప్రార్థించుము ‖
Verse
యెడతెగక నీవు ప్రార్థించినా
విసుగక నీవు ప్రార్థించినా‖ 2x ‖
సమస్తమును నీవు పొందెదవు
తప్పక న్యాయము పొందెదవు‖ 2x ‖
నీ కొరకై ప్రభు వేచియున్నాడు
ప్రార్థనలో కనిపెట్టుము‖ 2x ప్రార్థించుము ‖
Verse
కష్టము నష్టము కలిగినను
శోధన బాధలు వచ్చినను‖ 2x ‖
సాతాను నీపై విజృంభించి
నిన్ను గాయపరచినను‖ 2x ‖
భయపడకుము ప్రభువే నీకు
జయము నిచ్చును‖ 2x ప్రార్థించుము ‖
Verse
ప్రభువే మనతో సెలవిచ్చెను
మెళకువగా నుండి ప్రార్థించుమని‖ 2x ‖
విశ్వాసము కోల్పోయే దినములలో
విశ్వాసముతో ప్రార్థించినా‖ 2x ‖
సాతాను దుర్గములను పడగొట్టి
బలము పొందెదవు‖ 2x ప్రార్థించుము ‖
Verse
ప్రభువచ్చు వేళాయే గమనించుము
ఆత్మ వలన ప్రతి విషయములో‖ 2x ‖
ప్రార్థన విజ్ఞాపన చేయుచు
పూర్ణమైన పట్టుదలతో‖ 2x ‖
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు
మెళకువగా నుండుడి‖ 2x ప్రార్థించుము ‖
Verse
యెరూషలేము క్షేమముకై
అన్యజనుల రక్షణకై‖ 2x ‖
భారముతో నీవు ప్రార్థించిన
ప్రభువే నీకు ఫలమిచ్చును‖ 2x ‖
వారి క్షేమమే నీ క్షేమమునకు
ఆధారమగును‖ 2x ప్రార్థించుము ‖

Related Tags

FaithPrayerDevotion