Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabalamugane Prasthuthinchedha Prabhu

ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభు

Prabalamugane Prasthuthinchedha Prabhu

Lyricist: Chetti Bhanumurthy
Chorus
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము
నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా‖ ప్ర ‖
Verse
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి
కా నందమొసగిన మహిమతేజుడవు‖ ప్ర ‖
Verse
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో‖ ప్ర ‖
Verse
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను
గారవించిన నీతిరాజితడే‖ ప్ర ‖
Verse
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక
జాలమేలనురా‖ ప్ర ‖
Verse
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది
సుగుణశోభిత సమ్మదిని నిమ్మా‖ ప్ర ‖

Related Tags

PraiseWorship