Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhaava Shakthulu Kalgina Raajunuthimpu

ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు

Prabhaava Shakthulu Kalgina Raajunuthimpu

Verse 1
Reference: రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. కీర్తన Psalm 145:1
Verse
ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు
దీని ప్రయాత్మ! కోరుదు రేని స్మరింపు
కూడుడిదో! కన్నెర వీణలతో గానము చేయనులెండి
Verse
సర్వము వింతగ పాలన చేసెడివాడు
రెక్కలతో నిను మోసెను గావున బాడు
నీకు సదా కావలి యుండుగదా - దాని గ్రహింపవదేల
Verse
ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి
సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి
కష్టములో కప్పుచు రెక్కలతో గాచిన నాథునుతించు
Verse
స్నేహపు వర్షము - నీపై తా గురియించి
అందరు చూచుచు ఉండగానే కరుణించి
దీవెనలు నీకు నిరంతరము నిచ్చిన నాథునుతించు
Verse
నాథుని నామము - నాత్మ స్మరించి నుతింపు
ఊపిర గల్గిన స్వరమా నీవు నుతింపు
సంఘములో నాబ్రాహం సంతతిలో - నాథునుతింపుము

Related Tags

PraiseWorship